అంగన్వాడి, పంచాయతీ భవనాలకు రూ. 3.10 కోట్లు మంజూరు
అంగన్వాడి, పంచాయతీ భవనాలకు రూ. 3.10 కోట్లు మంజూరు
– కాటారం సబ్ డివిజన్ కు మహర్ధశ
– మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి.
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: మంథని నియోజక వర్గం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 5 మండలాలకు గాను 12 అంగన్వాడి కేంద్రాలు మరియు 8 గ్రామపంచాయతీ నూతన భవనాలకు 3 కోట్ల 10 లక్షలు నిధులను ఐ టీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబం ధించి కాటారం, మహా ముత్తారం, మహాదేవపూర్, మల్హర్ రావు, పలిమెల మండలాల్లో 12 అంగన్వాడి కేంద్రాలను మరియు 8 గ్రామపంచాయతీ నూతన భవనాలను గుర్తించి మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ రాహుల్ శర్మ భవనాలను మంజూరు చేశారు. కాటారం మండలంలోని నూతన అంగన్వాడి భవనాలు (1) చిద్నేపల్లి, 2) లక్ష్మీపూర్ (దామెర కుంట), 3) దేవరాoపల్లి(రేగుల గూడెం), 4) గుండ్రా త్ పల్లి ఉన్నాయి. కాటారం మండలంలోని నూతన గ్రామపం చాయతీ భవనాలు (1) శంకరంపల్లి, 2) ధర్మసాగర్, 3) రేగుల గూడెం, 4) అంకుసాపూర్ ఉన్నవి. మహా ముత్తారం మండ లంలోని నూతన అంగన్వాడి భవనాలు..1) గండి కామా రం-2, 2) పోలారం, 3) శ్రీపాద కాలనీ (కొర్లకుంట) ఉన్నవి. మహాదేవపూర్ మండలంలోని నూతన అంగన్వాడి భవనా లు (1)సూరారం -1, 2)బెగ్లూర్-1, 3) బ్రాహ్మణపల్లి-2 ఉన్నవి. మహాదేవపూర్ మండలంలోని నూతన గ్రామపంచాయతీ భవనాలు 1) బెగ్లూర్ 2) సూరారం ఉన్నవి. మల్హర్ రావు మండలంలోని నూతన అంగన్వాడి భవనాలు. 1) పెద్ద తుండ్ల -1 (2)రుద్రారం -1 ఉన్నవి. మల్హర్ రావు మండలంలోని నూతన గ్రామపంచాయతీ భవనాలు-1) రుద్రారం ఉన్నది. పలిమెల మండలంలోని నూతన గ్రామపంచాయతీ భవనాలు1) దమ్మురు ఉన్నవి. 1) కాటారం సిసి డ్రైన్ శ్రీపాద కాలనీ -10 లక్షలు,(2)సీసీ రోడ్డు వివేకనంద స్కూలు నుండి అయ్యప్ప టెంపుల్ వరకు – 5 లక్షలు , (3) సీసీ రోడ్డు శ్రీ హర్షిత డిగ్రీ కాలేజ్ నుండి ఓల్డ్ సినిమా టాకీస్ వరకు – 5 లక్షలు, (4) సీసీ రోడ్డు ఉదయ్ ఇంటి నుండి అయ్యప్ప టెంపుల్ వరకు – 5 లక్షలు. (5) సీసీ రోడ్డు బాజీ ఇంటి నుండి ఎండి బాబర్ ఇంటి వరకు – 5 లక్షలు, (6) సీసీ రోడ్డు బజార్ ఓదెలు ఇంటి నుండి ఇప్పల గూడెం రూట్ వరకు – 4 లక్షలు,(7)సీసీ రోడ్డు పర్లపల్లి నారాయణ ఇంటి నుండి మార్కెట్ రోడ్డు వరకు -8 లక్షలు, (8) సీసీ రోడ్డు ఖమ్మం రాజయ్య ఇంటి నుండి పెనుగొండ సురేష్ ఇంటి వరకు -4 లక్షలు,(9) సిసి డ్రైన్ తయూబ్ ఇంటి నుండి మార్కెట్ రోడ్ వరకు – 8 లక్షలు మంజూరు అయ్యాయి. మంజూరైన ప్రతి అంగన్వాడి కేంద్రానికి 8 లక్షల రూపాయలను ఎన్ఆర్ఈజీఎస్, ఇతర నిధులనుండి 5 మండలాలకు గాను 12 అంగన్వాడి కేంద్రాలు మరియు 8 గ్రామపంచాయతీ నూతన భవనాలకు మరియు సీసీ ట్రైన్ , సిసి రోడ్స్ 3 కోట్ల 10 లక్షలు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కలెక్టర్ నిధులు మంజూరు చేశారని మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కాటారం, మహా ముత్తా రం, మహాదేవపూర్, మల్హర్ రావు, పలిమెల మండలాల్లో మంజూరైన గ్రామాలు అంగన్వాడి కేంద్రాల భవనాలకు, గ్రామపంచాయతీ భవనాలు సంబంధించిన గ్రామాలలోనీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపారు.