చిన్నబోయినపల్లి – తాడ్వాయి మధ్యలో రోడ్డు ప్రమాదం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లి – తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన చోటు చేసుకుంది. తాడ్వాయి వైపు నుంచి వస్తున్న ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగా ఈ ప్రమాదంలో నిఖిత అనే యువతి కాలు విరగడంతో పాటు తలకు బలమైన గాయమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, బాధితు రాలిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.