బ్యాంకు ఖాతాదారులకు, ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం

Written by telangana jyothi

Published on:

బ్యాంకు ఖాతాదారులకు, ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం

– పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు. 

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు బ్రాంచ్ వద్ద బ్యాంకు పని నిమిత్తం వచ్చే వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు ముందు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఒరిగిన భారి మర్రి చెట్టు కింద వేచి ఉంటున్నారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సుమారు 150 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ప్రధాన రహదారికి ఇరువైపులా మర్రి, రావి చెట్లను నీడ కోసం నాటించారు. అయితే ఏ.పీ.జీ.వీ.బీ బ్యాంకు బ్రాంచ్ ముందు ఉన్న మర్రిచెట్టు ఒరిగిపోయి ఏ క్షణంలో అయినా క్రూకటి వ్రేళ్ళతో సహా పెకిలి, కూలి.పోయే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇటీవల భారీ వర్షాలు, తుఫానుల కారణంగా ఒరిగిన మర్రిచెట్టు భారీ లావు కొమ్మ ఒకటి విరిగి, కింద ఉన్న పచ్చి మండల పై కొమ్మలపై బ్యాలన్సు గా ఆగి ఉంది. ఆ విరిగిపోయిన కొమ్మ ఏ క్షణంలోనైనా చెట్టు కింద నిలబడి ఉన్న ప్రజలపై పడి ప్రాణనష్టం , ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఏ క్షణం నైనా కూలిపడే మర్రిచెట్టు భయంతో పాటు, చెట్టు పై కొమ్మల్లో ఉన్న భారీ లావు కొమ్మ విరిగి పచ్చిమండలపై బాలన్స్ గా ఆగి ఉంది. ప్రతినిత్యం ఏపీజీవీబీ బ్యాంకు కార్యకలాపాలు నిమిత్తం వందలాది మంది ఖాతాదారులు, మండలం లోని 18 జీ.పీ .ల నుండి వచ్చి బ్యాంకు ముందున్న మర్రి చెట్టు కింద వేచి ఉంటున్నారు. అంతేగాక రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 గా ఈ రహదారి గుండా నిత్యం రేయింబవళ్లు వాజేడు, వరంగల్, ఛత్తీస్గడ్ జాతీయ రహదారులకు వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఒరిగిన మర్రిచెట్టు, విరిగిన భారీ కొమ్మలు పచ్చికొమ్మలపై బాలన్స్ గా ఉండి ,ప్రమాద భరితంగా ఉన్న విషయాన్ని పలువురు ఆర్. అండ్. బి అధికారులకు తెలియపరిచిన ,నిర్లక్ష్యం వహిస్తున్నారని, కూలిపడితే భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదభరితంగా ఉన్న బ్రిటిష్ కాలం నాటి మర్రిచెట్టును వెంటనే తొలగించే విధంగా, రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, ప్రజలు పత్రికా ముఖంగా ములుగు జిల్లా కలెక్టర్ , మరియు ములుగు జిల్లా ఎస్.పి. ఎటునాగారం ఏ .ఎస్ .పి. వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు పత్రికా ముఖంగా ముక్తకంఠం తో విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment