వెంకటాపురం మండలంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
– 7 గంటల పాటు శ్రమించిన విద్యుత్తు సిబ్బంది.
వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటా పురం సబ్ స్టేషన్ లో భారీ వర్షాలతో చెట్లు విరిగిపడటంతో శుక్రవారం మధ్యాహ్నం నుండి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. సుమారు 20 మందికి పైగా విద్యుత్ సిబ్బంది 7 గంటల పాటు శ్రమించి విద్యుత్ సబ్స్టేషన్ ట్రాన్స్ఫారం మరియు బ్రేకర్స్ మరమతులు నిర్వహించి రాత్రి 9 గంటల సమయంలో విధ్యుత్ ను పునరుద్ధరించారు. మండలంలోని సుమారు 24 గ్రామాలలో మధ్యాహ్నం నుండి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ లేకపోవడంతో ఆయా గ్రామాలన్ని అంధ కారంలో మగ్గాయి. అసలే వర్షాకాలం దోమలు తో ఇబ్బంది పడే ప్రజలకు ఏడున్నర గంటలపాటు సరఫరా లేకపోవడంతో కష్టాలు పడ్డారు. సిబ్బంది రాత్రి సమయంలో కూడా శ్రమించి వినియోగదారులకు విద్యుత్ విద్యుత్ ను పునరుద్ధరించటం తో పలువురు విద్యుత్ శాఖకు అభినందనలు తెలిపారు.