శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద మంచినీటి బావికి మరమ్మత్తులు 

Written by telangana jyothi

Published on:

శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద మంచినీటి బావికి మరమ్మత్తులు 

– భక్తుడు వద్ది శ్రీనాథ్ పటేల్ కు పలు వురు భక్తులు అభినందనలు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణ శివారు పెరిక వీధిలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న మంచినీటి బావికి  ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం యజమాని వద్ది త్రినాద్ పటేల్ సొంత ఖర్చులతో మరమ్మత్తులు నిర్వహిం చారు. పూర్వకాలం నుండి పేరు ప్రతిష్టలు కలిగిన భక్తుల ఇలవేల్పు అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకుని, శుభకార్యాలు, వ్యవసాయ, వ్యాపార ప్రారంభాలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో నిరాజనాలు అందుకుంటున్నారు. అయితే మంచినీటి బావి సిమెంటు వరలు పగిలిపోవడంతో శ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు నీటీ కోసం ఇబ్బందులు పడుతున్నారు. వద్ది శ్రీనాథ్ కొత్త సిమెంట్ రింగ్స్ ను తెప్పించి బావి చుట్టూ వెడల్పుగా సిమెంట్తో ఫ్లోరింగ్ చేసి బావినుండి నీటిని బకెట్ తో తోడు కునేందుకు గిలకల ఏర్పాటుతో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు త్రినాద్ నడుం బిగించి, సిమెంట్ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. దైవ భక్తితో అమ్మవారి కృపకు పాత్రులైన శ్రీనాథ్ భక్తి కి పలువురు ఆయనకు అభినం దనలు తెలిపారు.

Leave a comment