చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మతులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలి

చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మతులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.

తెలంగాణ జ్యోతి, మహాదేవపూర్ : చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మత్తు పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మహాదేవపూర్ మండల పరిది లోని బీర సాగర వద్ద చేపట్టిన చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 45 వేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందిం చేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. పంప్ హౌస్ లో ఉన్న మూడు మోటార్లు మరమ్మత్తులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ పంప్ హౌస్ ద్వారా మందిరం, ఎర్ర చెరువులకు సాగు నీరు సరఫరా ఉంటుందన్నారు. 65 శాతం పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన 35 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉన్నట్లు చెప్పారు. రానున్న వానా కాలం వరకు పనులు పూర్తి చేయాలని ఇరిగే షన్ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు మహా దేవపూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈలు యాదగిరి, తిరుపతిరావు ఏ ఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment