పోచమ్మ గుడిని తొలగిస్తే ఊరుకునేది లేదు

పోచమ్మ గుడిని తొలగిస్తే ఊరుకునేది లేదు
– అధికారులకు సూచించిన ఆలయ కమిటీ
– కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగులోని బస్టాండ్ పక్కను ఉన్న పోచమ్మ గుడిని అబివృద్ధి పేరిట కూల్చవేయొద్దని, తొలగిస్తే ఊరుకునేదిలేదని ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ వాసులు అధికారులకు తేల్చి చెప్పారు. బస్టాండ్ విస్తరణలో భాగంగా బస్టాండ్ ను ఆనుకొని ఉన్న పోచమ్మ గుడిని తొలగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని తెలిసిన నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 50ఏళ్లుగా గ్రామదేవతగా కొలుచుకుంటున్న పోచమ్మ తల్లి గుడి ములుగు జిల్లా కేంద్రంలోని ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తూ ప్రజల క్షేమంగా ఉండేలా దీవిస్తోందని, అలాంటి గుడిని తొలగింస్తామనడం సరికాదన్నారు. పోచమ్మ తల్లి ఊరికి రక్షకు రాలిగా ఉంటోందని, ప్రతీ ఏటా వందలాదిగా బోనాలతో తరలివచ్చి తల్లికి సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ములుగు గ్రామం పుట్టిన నాటి నుంచి పోచమ్మ తల్లి ఈ గుడిలో కొలువై భక్తులకు దీవెనలు అందిస్తోందన్నారు. ములుగు ప్రజల సంస్కృతీ, సాంప్ర దాయాలను విశ్వసించాల్సిన ఆఫీసర్లు అందుకు విభిన్నంగా గుడిని తొలగిస్తామంటే ఊరుకు నేదిలేదని స్పష్టం చేశారు. అన్యమతస్తుల ఆలయాలను ముట్టుకోని అధికారులు హిందువుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి సీతక్క సైతం గుడిని తొలగించకుండా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని విజ్క్షప్తి చేశారు. ప్రభుత్వ అధికా రులు పోచమ్మ గుడిని తొలగించే ఆలోచన మార్చుకోకపోతే తీవ్రస్థాయిలో ఆందోళనకు సిద్ధమ వుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఏరువ పూర్ణచందర్, నేరళ్ల శంకర్, రేసోజు శ్రీధర్, డోలి రమేష్, కూన సుదర్శన్, గాదం కుమార్, యాసం రవి కుమార్, ఎల్కతుర్తి రాజన్న, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.