దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం తొలగింపు
– విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ప్రజలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణం శివారు, ఎస్సీ మర్రి గూడెం లో రోడ్ మధ్యలో మంచినీటి భావి పక్కన దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభంతో ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సార్లు అధికారులకు విన్నవించిన తొలగించలేదు. వెంకటాపు రం విద్యుత్ శాఖ ఏడిఈ ఆకిటి స్వామిరెడ్డికి విద్యుత్ స్తంభం తొలగించాలని గ్రామ ప్రజలు విన్నవించగా ఏడిఈ స్పందించి విద్యుత్ స్తంభం నడిరోడ్డుపై ఉన్న అంశాన్ని పరిశీలించారు. వెంటనే సిబ్బందిని స్తంభాన్ని తొలగించాలని ఆదేశించారు. యంత్రాన్ని, సామాగ్రిని, వైర్లను అప్పటికప్పుడే తెప్పించి బుధవారం ఉదయం పనులు ప్రారంభించి గంటల వ్యవధిలో పనులు పూర్తి చేశారు. దీంతో నడిరోడ్ పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మంచినీటి భావి పక్కన అడ్డు రాకుండా కొత్త పోల్ ని వేసి విద్యుత్ సరఫ రాను పునరుద్ధరించారు. ఎన్నో సంవత్సరాలుగా నడిరోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభం బాధ నుండి బుధవారం విముక్తి కలగ టంతో ఎస్సీ మరి గూడెం కాలనీవాసులు,ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.