గృహ జ్యోతి పథకం కింద వివరాలు నమోదు. 

Written by telangana jyothi

Published on:

గృహ జ్యోతి పథకం కింద వివరాలు నమోదు. 

– రేషన్ కార్డు లేకపోయినా నమోదు చేసుకోవచ్చు. 

– ప్రజాపాలన దరఖాస్తు రసీదు నెంబర్ నమోదు చేయించాలి. 

– విద్యుత్ శాఖ సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ దేవదాసు వెల్లడి. 

వెంకటాపురం నూగూరు, ఫిబ్రవరి 15,  తెలంగాణా జ్యోతి ప్రతినిది :  తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అభయహస్తం, ప్రజాపాలన దరఖాస్తుల స్వీక రణలో అందిన దరఖాస్తులలో గ్రుహ జ్యోతి పథకం కింద ప్రభుత్వ పరంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు పథకం అమల్లో భాగంగా ఆయా విద్యుత్ సర్వీసు నెంబర్లు, ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తు రసీదు నెంబరు, సెల్ఫోన్ నెంబరు తదితర వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ భూపాలపల్లి జిల్లా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ దేవదాస్ తెలిపారు. గురువారం సాయంత్రం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో ప్రజాపాలన గ్రామ సభలలో అందిన ధరఖాస్తులు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు నమోదు కార్యక్రమాన్ని సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ దేవదాసు తనిఖీ చేశారు.ఆయా వివరాలను వెంకటాపురం సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ నమోదు వివరాలను వినియోగదారుల నుండి నమోదు చేసిన వివరాలను విద్యుత్ అధికారులకు తెలియపరిచారు. ఈ సందర్భంగా సీనియర్ ఎకౌంట్స్ ఆఫీ సర్ దేవదాసు మాట్లాడుతూ విద్యుత్ సర్వీసు నెంబర్ తో పాటు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబరు, రేషన్ కార్డునెంబర్ , ప్రజా పాలన దరఖాస్తు రసీదు నెంబరు ,రేషన్ తో సహా నమోదు చేయించుకోవాలని తెలిపారు. అయితే రేషన్ కార్డు లేని వారు కూడ వివరాలు కూడా ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు కార్యక్రమాల్లో నమోదు చేయడం జరుగుతుందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి ఉత్తర్వులతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వెంకటాపురం మండలంలో వెంకటాపురం, ఆలుబాక విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో సుమారు 8 వేలకు పైగా గృహ అవసరాల విద్యుత్తు సర్వీసులు ఉన్నాయన్నారు. మండలంలో సుమారు 53 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా సర్వీసులలో ప్రభుత్వపరంగా ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ సర్వీసులతో పాటు, ఇతర గృహ అవసరాల సర్వీసులు ఉన్నాయన్నారు. వెంకటాపురం ,ఆలుబాక విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 14 డిస్ట్రిబ్యూషన్ లు ఉన్నాయని తెలిపారు. పంచాయతీ పరిధిలో ప్రతిరోజు విద్యుత్ శాఖ తరపున గృహ జ్యోతి పథకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కార్యక్రమానికి కావలసిన డాక్యుమెంట్లు నమోదు చేయించుకోవాలని టామ్, టామ్, చాటింపులు, మరియు ఆటోల ద్వారా మైక్ లతో గ్రామాల్లో విస్తృతమైన ప్రచారం నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. దీంతో అనేకమంది విద్యుత్ సర్వీసు కలిగిన గృహస్తులు,వినియోగదారు లు వాటి యజమానులు గృహజ్యోతి పథకం నమోదు కార్యక్రమంలో పాల్గొని, తమ డేటాను నమోదు చేసుకుంటు న్నారని తెలిపారు. వ్యవసాయ ప్రాంతం కావడంతో వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా, ఉదయం పూటనే గ్రామాల్లో ప్రచారం చేయడం వల్ల గృహ జ్యోతి పథకం నమోదులో రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాల విద్యుత్ వినియోగదారులు ఇతరులు నమోదు కు ఆయా నమోద సెంటర్లు లలో క్యూలు కడుతున్నారని తెలిపారు. ఈ మేరకు వెంకటాపురం,ఆలుబాక విద్యుత్ సబ్ స్టేషన్ ఎ.ఇ.సునీల్ మరియు సిబ్బంది సేవలు ను సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ దేవదాసు ప్రశంసించారు. వెంకటాపురం విద్యుత్ శాఖ ఏ.ఈ సునీల్ పర్యవేక్షణలో విద్యుత్ శాఖ సిబ్బంది, గృహజ్యోతి పథకం కార్యక్రమంలో వినియోగదారుల వివరాలు నమోదు సేవలు అందిస్తున్నారని వారి సేవలను ప్రశంచించారు. జూనియర్ విద్యుత్ లైన్ మేన్లు ఫరీద్‌ , పాషా, రాజు మరియు సిబ్బంది గృహ జ్యోతి పథకం నమోదు కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేసేందుకు ఎ.ఇ.పర్యవేక్షణలో విధులు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 20వ తేదీ లోగా గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ దేవదాసు వెంట ములుగు విద్యుత్ శాఖ ఎకౌంట్స్ ఆఫీసర్ శ్రీనయ్య, మరియు వెంకటాపురం విద్యుత్ శాఖ ఏ.ఈ. సునీల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now