కోటి లలితా సహస్రనామ పారాయణం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కోటి లలిత సహస్ర నామ పారాయణం కోసం ఆసక్తిగల మహిళలందరూ ఒకే గళం ఒకే కంఠంతో శ్రీ మాత్రే నమః అనుగ్రహంతో గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు కోటి కంఠ గానం చేశారు. బెంగళూరు కు చెందిన ఇంతి మీ వాసవి సిస్టర్స్ నాద నీరా జనం సేవా ఉచిత సంగీత శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో కార్య క్రమానికి పిలుపునివ్వగా కాటారం మండల కేంద్రంలో మహి ళలు కోటి లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మహిళలు గృహాల లోను ,దేవాలయాలు, సామూహికంగా సంఘాల ఆధ్వర్యం లో జిల్లాలోని వివిధ గ్రామాలలో ఈ కార్యక్రమం నిర్వహిం చారు. ఉన్న చోటే కూర్చొని ఒకే సారి కోటి కంఠ గానంతో అనగా ఒకే రోజున ఏక కంఠంలో ఒకే సమయములో అందరు ఒక్క సారి లలిత సహస్రనామ పారాయణం చేశారు. దీనిని బెంగళూరులోని శ్రీ మహా ప్రత్యంగిరా దేవికి సమర్పించారు. ఈకార్యక్రమంలో కాటారం గ్రామానికి చెందిన మహిళలు బచ్చు ప్రేమలత,పవిత్రం నిర్మల, మద్ది శ్రీదేవి, మద్ది నీరజ, బీరెళ్ళి పావని, చంద శోభ, అల్లాడి భువనేశ్వరి, ఓల్లాల మాధవి, అల్లాడి వరలక్ష్మి, అల్లాడి సంతోషి, మౌనిక, నిఖిత లు పాల్గొన్నారు.