రైతువేదికలో రుణమాఫీ పై ఫిర్యాదుల స్వీకరణ
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి: వెంకటాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ములుగు సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ పాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పై ఫిర్యాదుల స్వీకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఎం కళ్యాణి మాట్లాడుతూ వెంకటాపూర్ మండలంలో 2001 ఒక మంది రైతులకు రుణమాఫీ లక్ష లోపు విడుదలై బ్యాంకులో జమ చేసిందని అన్నారు. రుణమాఫీ పై సమస్యలు ఉంటే పట్టా పాస్ పుస్తకం ,ఆధార్ కార్డు తీసుకొచ్చి ఆయా గ్రామాలలో రైతు వేదికలో గల ఏ ఈ ఓ లను సంప్రదించాలని వారు పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.