ఆదివాసి న్యాయ కళాశాల కోసం ఉద్యమానికి సిద్ధం
ఆదివాసి న్యాయ కళాశాల కోసం ఉద్యమానికి సిద్ధం
– జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొమరం భీం కాలనీలో గొండ్వాన సంక్షేమ పరిషత్ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. ములుగు జిల్లా కార్య నిర్వ హణ అధ్యక్షులు పూనేం ప్రతాప్ అధ్యక్షతన వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 30 నుండి అన్ని మండల కేంద్రంలలో ఒకరోజు ధర్నాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే, ఆదిమ తెగల భవిష్యత్తు బాగుం టుందని ఆయన అన్నారు.భద్రాచలం కేంద్రమైన చతిస్గడ్, ఒరిస్సా, సరిహద్దు ప్రాంతాలైన భద్రాచలం కేంద్రంలో, ఆది వాసి విద్యార్థుల కోసం న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఆదివాసి చట్టాలపై ఆదివాసి హక్కులపై అవగాహన ఉంటుం దని, ఆదివాసీల భూములకు ఆదివాసి యువతే రక్షణగా ఉంటున్నారని ఆయన అన్నారు. ఆగస్టు 9న ప్రతి ఆదివాసి గూడెంలో ప్రపంచ ఆదివాసులు దినోత్సవం ఘనంగా నిర్వ హించుకోవాలని ఆదివాసి దినోత్సవాన్ని క్యాలెండర్లో రాయా లని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో కొమరం భీమ్ కాలనీ ఆదివాసులు తదితరులు పాల్గొన్నారు.