రావణాసురవధను విజయవంతం చేయాలి
– ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్
– ములుగులో ఏర్పాట్లు పూర్తి
ములుగు ప్రతినిధి : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే రావణాసురవధ వేడుకలకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగులోని సాధన హై స్కూల్ సమీపంలోని గ్రౌండ్ లో చేపట్టిన ఏర్పాట్లను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. గత 23ఏళ్లుగా నిర్వహి స్తున్న రావణాసురవధకు ప్రజల ఆదరణ ఉందని, దసరా పండుగ రోజున రావణ వధ కార్యక్రమం నిర్వహించుకోవడం, ప్రజలందరూ కుటుంబాల సమేతంగా తరలివచ్చి కన్నుల పం డువగా జరిగే వేడుకలను వీక్షించడం ఆనవాయితీగా వస్తోం దన్నారు. జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫైర్ వర్క్స్ తో అబ్బుర పరిచే విధంగా వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 20వేల మంది తరలివచ్చే ఈ వేడు కలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్య క్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చెలుమల్ల రాజేందర్, గందె రాజు, పాడ్య కుమార్, కొత్త సురేందర్, నగరపు రమేష్, పాడ్య చంటి, మేడుదుల మమన్, రాసమల్ల శివాజీ, తదితర ఉత్స వ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
– రావణాసురవధకు రావాలని జడ్జి కన్నయ్యలాల్, మంత్రి సీతక్కలకు ఆహ్వానం..
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగులో శనివారం నిర్వహించే రావణాసురవధ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ములుగు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ టి.కన్నయ్యలాల్, రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) లను శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యు లు ఆహ్వానించారు. ధర్మజాగరణ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్జి కన్నయ్యలాల్ ఉత్సవానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత 23 సంవత్సరాలు గా నిర్వహిస్తున్న రావణాసురవధ కార్యక్రమ వివరాలను వివరించారు. అయితే గతంలో రావణాసురవధ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క గత జ్క్షాపకాల ను కమిటీ సభ్యులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో దుబాసి రమేష్ (బాంబే క్లాత్ స్టోర్స్) ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు రాసమల్ల శివాజీ, కన్వీనర్ పాడ్య కుమార్, ప్రధాన కార్యదర్శి గందె రాజు, పబ్లిసిటీ ఇన్చార్జి మేడుదుల మమన్ పాల్గొన్నారు.