రామారావు మృతి దేహానికి నివాళులర్పించిన రాణా ప్రతాప్ రెడ్డి
దుగ్గొండి, తెలంగాణ జ్యోతి : ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ అధినేత నాయినేని సంపత్ రావు తండ్రి రామారావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన చిత్ర పటానికి వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పూలమాల వేసి నివాళులను అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఆయన వెంట నర్సంపేట పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు , నర్సంపేట పట్టణ వార్డు కౌన్సిలర్ బానోత్ కవిత – వీరన్న , నర్సంపేట నియోజకవర్గ యువ మోర్చా ఇంఛార్జి కొంకీస విఘ్నేష్ గౌడ్ తదితరులున్నారు.