Ramappa | రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్

Written by telangana jyothi

Published on:

Ramappa | రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి :  వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాలలో భాగంగా పర్యాటక మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ కార్యాలయం ఏఎస్ఐ రామప్ప, యువటూరిజం క్లబ్ సహకారంతో పాఠశాల విద్యార్థులు సోమవారం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప లో హెరిటేజ్ వాక్‌ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థు లకు వారసత్వ నడకలు, మన సంస్కృతి, సంప్రదాయం, తత్వశాస్త్రం, పురాణాలు మరియు సంబంధిత ఆచారాలను తెలుసుకున్నారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతమైన రామప్ప దేవాలయాన్ని సందర్శించడం వల్ల విద్యార్థులకు లోతైన విద్యా అనుభవంగా ఉంటుంది. చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్పం మరియు భారతదేశం యొక్క గొప్ప వారసత్వం పట్ల లోతైన ప్రశంసలను పెంపొందించడంలో అంతర్దృష్టు లను అందిస్తుంది.

Leave a comment