రమనీయం.. కమనీయం…
– శ్రీరామ నామస్మరణతో పులకించిన భక్తజనం
– సీతారాముల కళ్యాణానికి హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి : చైత్రమాసం శ్రీరామ నవమి రోజున ఈ వసంతంలో కమనీయమైనది సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఇంటింటా.. వాడవాడలా.. చలువ పందిళ్లు.. పచ్చని మామిడి తోరణాలతో ప్రతి గ్రామంలో శ్రీరామ నామస్మరణతో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరంలోని అనుబంధ ఆలయం రామాలయంలో.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కుటుంబం నిర్మించిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో.. సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికల పైన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం రమనీయం… కమనీయంగా జరగగా భక్తజనం పరవశించిపోయింది. ధన్వాడ గ్రామంలో జరిగిన బి సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్జిల్లా శ్రీధర్ బాబు, తల్లి జయమ్మ, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, సోదరులు కాంగ్రెస్ నాయకులు దుద్దిల్ల శ్రీనుబాబు దంపతులతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఇంటి నుండి ట్రస్ట్ చైర్మన్ దుద్దిల శీను బాబు దంపతులు పల్లకిలో శ్రీ సీతారాముల విగ్రహాలను తీసుకొని రాములోరి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో గ్రామ ప్రజలు అందరూ మంగళ హారతులతో మహిళలు కళ్యాణ వేదికకు తరలి వచ్చారు. శ్రీభక్త ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తులు చూసి తరించారు. మండలంలోని దామెరకుంట, గారేపల్లి, బయ్యారం గ్రామాల లోనూ, మహాదేవపూర్ మండలంలోని శ్రీ మందరగిరి వెంకటే శ్వర స్వామి దేవాలయంలో, భూపాలపల్లి జిల్లా మంజూరు నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, భూపాలపల్లి లోని శ్రీ సీతారామ ఆలయంలో సీతారాముల కళ్యాణం ఆదివారం కన్నుల పండుగల జరిగింది. కళ్యాణం జరిగిన గ్రామాలలో వెలువల భక్తులు తరలివచ్చారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన రాములవారికి సకల సుగుణాల రాశి సీతమ్మకు జరిగిన కల్యాణోత్సవంలో ప్రజలు భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు. దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు సమర్పించారు.
ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి : మంత్రి శ్రీధర్ బాబు
విశ్వ వాసు నామ సంవత్సరంలో మొదటి పండుగ శ్రీరామ నవమి రావడం ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సుభిక్షంగా రాష్ట్రంలో పంటలు పండి ఆనందమయంతో ప్రజలు జీవించాలని బ్రహ్మాండ నాయకుడు శ్రీరాముని వేడుకున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జరిగిన రాములోరి కళ్యాణానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలందరి పైన శ్రీ సీతారాముల కటాక్షం కలగాలని అన్నారు.