సెంట్రల్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కమిటీ సభ్యునిగా రాజ్ కుమార్
ములుగు, తెలంగాణ జ్యోతి : సెంట్రల్ హోదా ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరి కమిటీ సభ్యుని ములుగు చెందిన బాణాల రాజ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు బోర్డు రీజినల్ అధికారి సైఫ్ అలీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హోదాలో రాజ్ కుమార్ తన బాధ్యతలను డిసెంబర్ 12 2025 వరకు నిర్వర్తించనున్నారు. బాల్యం నుంచి స్వయం సేవగ్ గా, విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లాస్థాయి కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ ములుగు మండల అధ్యక్షుడిగా పనిచేసిన తనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యునిగా బాధ్యతలు రావడం పట్ల రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్ కుమార్ నియామకం పట్ల పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.