మేడారం భక్తుల సేవలో రాధా టిఎంటి స్టీల్ ఉచిత మినరల్ వాటర్ సరఫరా
– రాధా టింఎంటి స్టీల్ ఎండి సుమన్ సరాఫ్
ములుగు/ మేడారం, తెలంగాణ జ్యోతి : మేడారం భక్తుల సేవలో భాగంగా రాధా టిఎంటి స్టీల్ కంపెనీ భక్తులకు ఉచిత మంచినీటి సరఫరా చేస్తున్నట్లు రాధా టింఎంటి స్టీల్ ఎండి సుమన్ సరాఫ్ తెలిపారు.ఈ సందర్భంగా రాధా టిఎంటి స్టీల్ కంపెనీ ఎండి సుమన్ సరాఫ్ మాట్లా డుతూ మేడారం జాతర భక్తుల సౌకర్యార్థం గత మూడు మహా జాతరల్లో తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 19 సోమవారం మేడారంలో ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాలను ప్రారంభిం చారు. ములుగు జిల్లా మేడారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, డిపిఓ కొండా వెంకయ్య, ములుగు డిఎంహెచ్ఓ, ఐఆర్‌సిఎస్ ఛైర్మన్ డాక్టర్ అల్లెం అప్పయ్య, ఐఆర్‌సిఎస్ రాష్ట్ర ఎంసి సభ్యుడు కొత్తపల్లి ప్రసాద రావు,కంపెనీ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆసియా ఖండం నలుమూలల నుండి పెద్దఎత్తున ప్రజలు వచ్చే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులను ఆదుకునేందుకు తమ సంస్థ ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.19 ఫిబ్రవరి నుండి 25 వరకు కొనసాగే ఈ కేంద్రాల్లో భక్తులకు ఉచితంగా మినరల్ వాటర్ అందజేస్తామన్నారు. అదేవిధంగా జాతర జరిగే మేడారంతో పాటు జాతరకు వెళ్లే పలు మార్గాల్లో, కీలక ప్రదేశాల్లో అవగాహన బోర్డులను ఏర్పాటు చేసిందని, తెలంగాణ రాష్ట్రం లోనే అత్యధిక వ్యాపారం చేస్తున్న తమ సంస్థ ద్వారా సమాజ సేవ చేసేందుకు ఎల్లవేళలా ముందు ఉంటామన్నారు.కంపెనీ జిఎం వీరేష్‌కుమార్,ఏజీఎం నరేష్‌గౌడ్, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి వెంకటేశ్, కంపెనీ డీలర్ గంగిశెట్టి శ్రీనివాస్,ఐఆర్‌సిఎస్ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.