వెంకటాపురంలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

వెంకటాపురంలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

– తక్కువ ధరలకు దళారులకు విక్రయించి నష్టపోవద్దు. 

– పిఎసిఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు వెంకటాపురం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంచనంగా ప్రారంభించారు. సహకార సంఘం అధ్యక్షులు చిడెం మోహన్ రావు, ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల తాసిల్దార్ లక్ష్మీరాజయ్య మాట్లాడుతూ రైతులు తాము పండిం చిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకొని ప్రభుత్వ మద్దతు ధరలు పొందాలని, దళారు లకు తక్కువ ధరలకు విక్రయించి నష్టపోవద్దని కోరారు. కామన్ రకాలు క్వింటాలకు 2,300, ఏ. గ్రేడ్ ధాన్యం 100 కీలోలకు 2,320 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుందనీ పీఏసిఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు తెలిపారు. అలాగే ఆరబెట్టి శుబ్రపరిచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. ఈ మేరకు వెంకటాపురం, బర్లగూడెం, ఉప్పెడు వీరాపురం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నవీన్, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వెంకటాపురం బ్రాంచ్ మేనేజర్ కే. నరసింహారావు, సొసైటీ కార్యదర్శి ఆర్ వి వీ సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్లు చిట్టెం ఆదినారాయణ, కోరం జానకిరామ్, ఏఇ.ఒ.శ్యామ్, సొసై టీ ధాన్యం కొనుగోలు కేంద్రా ల ఇన్చార్జీలు తోట పూర్ణ, సుధా రాణి సిబ్బంది, రైతులు తదితరులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment