🕉 రాశి ఫలాలు / పంచాంగం 🕉

🕉 రాశి ఫలాలు / పంచాంగం 🕉

🕉 రాశి ఫలాలు / పంచాంగం 🕉

వారం:శనివారం (స్థిరవాసరే), జనవరి.11,2025

శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం -హేమంత ఋతువు

పుష్య మాసం – శుక్ల పక్షం తిథి:ద్వాదశి ఉ7.48 వరకు

తదుపరి త్రయోదశి తె6.12 వరకు నక్షత్రం:రోహిణి మ12.29 వరకు

యోగం:శుక్లం మ12.13 వరకు కరణం:బాలువ ఉ7.48 వరకు 

తదుపరి కౌలువ రా7.00 వరకు ఆ తదుపరి తైతుల తె6.12 వరకు

వర్జ్యం:సా5.50 – 7.22 దుర్ముహూర్తము:ఉ6.37 – 8.06

అమృతకాలం:ఉ9.26 – 10.57 మరల తె3.03 – 4.36

రాహుకాలం:ఉ9.00 – 10.30 యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00

సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి: వృషభం

సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం:5.39

   రాశి ఫలితాలు.   

మేషం : మిత్రులతో చిన్నపాటి వివాదాలు ముఖ్యమైన కార్యక్ర మాలు వాయిదా ఉంటాయి. పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

వృషభం : చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

మిధునం: వృత్తి,వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

కర్కాటకం :వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటా యి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి.

సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజం లో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య :పనులు కొన్ని వాయిదా పడుతాయి.కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొం టారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరస్తి వివాదాలలో శిరో బాధలు తప్పవు.

తుల : వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి వసూలవుతాయి. బకాయిలు

వృశ్చికం : నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసు కుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు : సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణంగందరగోళంగా ఉంటుంది.వ్యాపారాలు సామాన్యం గా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.

మకరం : ఉద్యోగులకు పని ఒత్తిడులు అధికమవుతాయి. ఆదా యానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహా రాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్య మైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవస రానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం : దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమా లకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

      సర్వేజనా సుఖినో భవంతు… Km

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment