వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా
– ఓవర్ లోడ్ సమస్యకు అదనపు ట్రాన్స్ ఫార్మార్ల బిగింపు
– విద్యుత్ శాఖ ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిం చేందుకు అవసరమైన ఏర్పాట్లు నిర్వహించాలని, ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో అదనంగా ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేయా లని విద్యుత్ ఏడీఈ ఆకిటి స్వామిరెడ్డి సూచించారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో అదనపు ట్రాన్స్ఫార్మర్లను మంగళ వారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ వాజేడు మండలంలోని చండ్రుపట్ల, పేరూరు, చెరుకూరు, గొల్ల గూడెం తదితర ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై అదనపు ఓవర్ లోడ్ కారణంగా తరచూ లో వోల్టేజ్ సమస్యతో వినియో గదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు లమేరకు 25 కేవీ మూడు అదనపు ట్రాన్స్ఫార్మర్లు, 100 కేవి కెపాసిటీతో ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మ ర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా వెంకటాపురం, వాజేడు మండలంలోని ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్లను గుర్తించి భారం తగ్గించుకునేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ వినియోగదారులు తమ కరెంట్ బిల్లులను సకాలంలో చెల్లించి, సంస్థకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాజేడు విద్యుత్ ఏఇ. హర్షత్ అహ్మద్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొ న్నారు.