మృతుల కుటుంబాలను పరామర్శించిన పుట్ట
మృతుల కుటుంబాలను పరామర్శించిన పుట్ట
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ఇటీవల కాలంలో మృతి చెందిన పలు కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి పుట్ట మధుకర్ బుధవారం పరామర్శిం చారు. కాటారం, గారేపల్లె లలో ఆయన పర్యటించి,. కటుకు శ్రీనివాస్, మొగిలి గట్టయ్యలు ఇటీవల చనిపోగా, మృతుల కుటుంబా లకు అండగా ఉంటామని అన్నారు. ఆయన వెంట కాటారం పార్టీ ఇంచార్జిజోడు శ్రీనివాస్, నాయకులు పంతకాని సడవలి, మందల లక్ష్మారెడ్డి, కొండ గొర్ల వెంకటస్వామి, పసుల శంకర్, మానం రాజబాబు, మెడిగడ్డ దుర్గారావు, పొడేటి లింగయ్య, అడవాల మురళి, సింగనవేన బాపు, గొల్లపల్లి అశోక్, జాడి శ్రీశైలం తదితరులు ఉన్నారు.