మృతుల కుటుంబాలను పరామర్శించిన పుట్ట మదు
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: ఇటీవల పలు కారణా లతో చనిపోయిన వారి కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మదు పరామర్శించారు. బుధవారం కాటారం మండలం గారేపల్లిలో మాదారపు రమేష్, సింగనబోయిన సుందర్ లు ఇటీవల మర ణించగా, వారి కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలి పారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి జోడు శ్రీనివాస్, రామిల్ల కిరణ్, వూర వెంకటేశ్వరరావు, పంతకాని సడవలి, గాలి సడవలి, తైనేని సతీష్, జక్కు శ్రావణ్, నరివేద్ది శ్రీనివాస్, గుండ్లపల్లి అశోక్, గంటసమ్మయ్య, జిమ్ముడ సమ్మయ్య,ఉప్పు సంతోష్ తదితరులు ఉన్నారు.