Putta Madhu | మధు రాజీనామా వద్దు – వారించిన కేసీఆర్

Written by telangana jyothi

Published on:

Putta Madhu | మధు రాజీనామా వద్దు – వారించిన కేసీఆర్

భూపాలపల్లి ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మంథనిలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీఆరెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పుట్ట మధూకర్ ఆయన సతీమణి పుట్ట శైలజ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా బీఆరెస్ అధినేత బాపు కేసీయార్ వారించి రాజీనామా ఆలోచనను విరమింప చేశారు. ఓటమి అనేది ఒక్క మంథనిలోనో పెద్దపల్లి జిల్లా పరిధిలోనో జరిగిన అంశం కాదని, ఓటమికి గల కారణాలను విశ్లేంచుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని, నైతిక బాధ్యత పేరుతో పదవులకు రాజీనామా చేయడం కాకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వారి హామీల అమలుకు ఒత్తిడి తేవాలని కోరారు. కార్యకర్తలకు అండగా ఉండి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్ద పదవిలో ఉన్న నువ్వే మూడు నియోజకవర్గాల కార్యకర్తలకు భరోసాగా నిలవాలని సము దాయించి రాజీనామా ఆలోచనను విరమింప చేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now