పుష్కరాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

పుష్కరాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

పుష్కరాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

– కాలేశ్వరంలో నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం,తెలంగాణజ్యోతి: భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కాలేశ్వరంలో మే 15వ తేదీ నుండి జరిగే సరస్వతి పుష్కరాల కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను మే 4వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటిం చారు. మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలిం చారు. మొదటగా విఐపి ఘాట్ వద్ద జరుగుతున్న ర్యాంప్ నిర్మాణం, సరస్వతి దేవి విగ్రహ ఏర్పాటుకు జరుగుతున్న నిర్మాణ పనులను, శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న మరుగు దొడ్ల పనులను పరిశీలించి, అక్కడి నుండి ప్రధాన ఘాట్ వద్ద జరుగుతున్న మరుగుదొడ్ల పనులను, విద్యుత్ స్థంబాల ఏర్పాటు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, నిర్మాణ పనులను ఆర్ డబ్ల్యు ఎస్ ద్వారా నిర్మిస్తున్న మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఈ.ఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కొన్ని చోట్ల శాశ్వత ప్రాతిపదికన పనుల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని త్వరిత గతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మరుగు దొడ్లు, మంచి నీరు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్ళ ఏర్పాటు చేయాలని మే 4వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, డీపీఓ నారాయణ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, దేవస్థానం ఈ.ఓ మహేష్, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment