28వ నుండి మొదలు కానున్న ప్రజా పాలన కార్యక్రమం
28వ నుండి మొదలు కానున్న ప్రజా పాలన కార్యక్రమం
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఈనెల 28వ తేదీ నుండి ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపడుతున్న ప్రజా పాలన డిసెంబర్ 28 తేది నుండి జనవరి 6 వరకు నిర్వహించబడుచును. ఇట్టి కార్యక్రమ నిర్వహ ణకు ముందస్తుగా, మండల స్థాయిలో రేపు 27 వ తేది బుదవారం సన్నాహక సమావేశం మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో నిర్వహించ నున్నట్లు ఏం.పి.డి.ఓ బాబు తెలిపారు. ఈ సన్నాహక సమావేశానికి ప్రజాప్రతినిధులు, మరియు ప్రజా పాలన టీమ్ సభ్యులు, మరియు సంబంధిత కౌంటర్ ఇంఛార్జి అధికారులకు నిర్వహించబడునని విధిగా హాజరుకావాలని కోరారు.ఈ సమా వేశానికి మీడియా ప్రతినిధులు ప్రజాపాలన సన్నాహక సమావేశం లో పాల్గోనాలని ఎంపీడీవో ఎ. బాబు తెలిపారు.