ప్రజా పాలన గ్రామసభలకు విశేష స్పందన.
వెంకటాపురంనూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రెండు రోజులు సెలవులు అనంతరం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కేంద్రాల వద్ద మంగళవారం పెద్ద సంఖ్యలో ఆయా పంచాయతీల గ్రామాల ప్రజలు తరలి వచ్చి దరఖాస్తులను అదికారులకు అంద జేశారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం, వాజేడు మండ లాల్లో అనేక పంచాయతీలలో ప్రజాపాలన స్వీకరణ కేంద్రాల వద్ద విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు దరఖాస్తు లు ఇచ్చేందు కు బారులు తీరారు. గ్రామాంతరం వెళ్లినవారు, ఇతర ప్రాంతాల్లో పనులు పై వెళ్లినవారు కూడా, ఈనెల ఆరో తారీకు తేదీ లోపల దరఖాస్తులను ప్రజాపాలన స్వీకరణ కేంద్రాల వద్ద అందజే యవచ్చు న ని అధికారులు ప్రకటించారు. వెంకటాపురం మండలం లోని పాత్రా పురం, రామచంద్రపురం,ఎదిర తదితర గ్రామాల్లో జరిగిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచు లు,అట్టం సత్యనారాయణ, కృష్ణార్జునరావ్, సమ్మయ్య ఆయా పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు, తాసిల్దార్ సమ్మయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ , ఉప సర్పంచ్లు, పంచాయతీ పాలకవర్గ సభ్యు లు పలువురు ప్రజాప్రతినిధులు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1 thought on “ప్రజా పాలన గ్రామసభలకు విశేష స్పందన. ”