అత్యాచార బాధిత మహిళ కానిస్టేబుల్ కు రక్షణ కల్పించండి

Written by telangana jyothi

Published on:

అత్యాచార బాధిత మహిళ కానిస్టేబుల్ కు రక్షణ కల్పించండి

– ఉద్యోగం నుండి తొలగించబడిన భవాని సేన్ గౌడ్ తో, మహిళా కానిస్టేబుల్ కు ప్రమాదం

– ప్రభుత్వపరంగా తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి

– జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ కు నివేదిక అందిస్తాం

– దళిత సంఘాల ఆధ్వర్యంలో డీఎస్పీకి ఫిర్యాదు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కాలేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై ద్వారా అత్యాచారానికి గురైన మహిళా కానిస్టేబుల్ విషయంలో శనివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో విచారణ చేపట్టడం జరిగింది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు (గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ), ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్ట్ బొంకూరి మధు, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పీక కిరణ్, రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సీనియర్ నాయకులు పొట్ల పోచయ్య, ఆదివాసి దళిత మహిళ హక్కుల సంఘం మహిళా కన్వీనర్ కుడిమెట్ల సరస్వతిలు, మహిళా కానిస్టేబుల్ కు ఎస్సై ద్వారా జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. కాలేశ్వరం, మహాదేవపూర్ ప్రాంతాలలో పర్యటించి ఎస్సైగా విధులు నిర్వహించిన సమయంలో భవాని గౌడ్ చేసిన పలు సంఘటనలను నివేదిక తయారు చేయడం జరిగింది. ఆడవారి పట్ల కాలేశ్వరం పోలీస్ స్టేషన్ కు వస్తున్న బాధితుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు పలువురిని అడిగి తెలుసుకోవడం జరిగింది. పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని బాధితులను అవమానిస్తూ, వారిపట్ల దారుణంగా వ్యవహరించేవారని కమిటీకి పలువురు వివరించారు. మహిళా కానిస్టేబుల్ విషయంలో కూడా తనకు అధికారుల అండ ఉందన్న తెగింపుతో ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. యావత్ సమాజం సిగ్గుపడే విధంగా, పోలీస్ డిపార్ట్మెంట్ కు కళంకం తీసుకువచ్చిన ఎస్సైని ఉద్యోగం నుండి తొలగించడం తో తగిన శాస్త్రి జరిగిందన్నారు, కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి దృష్టికి సంఘటనకు సంబంధించిన పలు విషయాలను తీసుకువెళ్లారు. ఆమెకు రక్షణ కల్పించాలని వినతి పత్రం అందజేశారు.

మహిళా కానిస్టేబుల్ కు రక్షణ కల్పించండి 

కాలేశ్వరంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కు ప్రమాదం జరిగితే దానికి, ఉద్యోగం నుండి తొలగించబడిన భవాని సీన్ గౌడే బాధ్యుడని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ బొంకూరి మధు, ఉత్తర తెలంగాణ,తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. బాధిత మహిళా కానిస్టేబుల్ కు తొలగించబడ్డ ఎస్సై ద్వారా ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వపరంగా ఆమెకు నష్టపరిహారం చెల్లిం చాలని, ఆమెకు ఏ ప్రమాదం జరిగిన ఉద్యోగం నుండి తొలగించబడ్డ భవాని గౌడ్ బాధ్యుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సీనియర్, నాయకులు పొట్ల పోచయ్య, ఆదివాసీ దళిత మహిళా హక్కుల కమిటీ, రాష్ట్ర అధ్యక్షురాలు, సరస్వతి, యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంతెన చిరంజీవి, చంద్రగిరి అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment