రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన
రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు మట్టి రోడ్డు బురుదమయంగా మారడం తో అందులో నాటు వేసి శనివారం కన్నాయిగూడెం మండలం లోని ముప్పనపల్లి గ్రామ పద్మశాలి వాడలో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వారం రోజుల నుంచి కురుస్తున్న ముసురు వర్షాలకు రోడ్డంతా బురుదామయంగా మారి నడవడానికి విలులేకుండా తయా రైందని, సిసి రోడ్డు వేయాలని అధికారులతో ఎన్ని సార్లు కోరిన ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిం చారు. వర్ష కాలం వచ్చిందంటే బురుదామయంగా మరీనా రోడ్డుపైనే వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.