నూతన ఇసుక రీచ్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందచేయాలి
– తహసీల్దార్లను ఆదేశించిన. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.
భూపాలపల్లి ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఐడిఓసి కార్యాలయం నుండి రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులతో సోమవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వ, పజల అవసరాలకు వినియోగించడానికి స్థానికంగా ఉన్న వనరుల నుండి ఇసుక తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ఇంటి నిర్మాణం కొరకు గ్రామ పంచాయతి కార్యదర్శి ద్వారా తహసీల్దార్ కు ప్రతిపాదనలు పంపాలని, అట్టి ప్రతిపాదనల మేరకు తహసీల్దార్ అనుమతులు జారీ చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేస్తే సరిపోయితుందని ఆయన పేర్కొన్నారు. ఆర్డిఓ, తహసీల్దార్, ఇరిగేషన్, భూ గర్భ జలశాఖ, ఆర్ డబ్ల్యూ ఎస్, పోలీసు, రవాణా శాఖ అధికారులు ద్వారా రీచ్ లు ఏర్పాటుకు నివేదికలు అందచేయాలని అన్నారు. గ్రామాలకు పరిమితమై వనరులు నుండి అనుమతులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్నారు. ఇష్టారీతిన ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫైలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎవరికి ఇస్తున్నామో రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. ఈ టెలి కాన్ఫెరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మైనింగ్ ఏ డి జయరాజ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.