చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఆదివారం ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహిం చారు. ఈ ఉచిత కంటి పరీక్షలకు సుమారు 150 మంది ప్రజ లు హాజరై కంటి పరీక్షలు చేయించుకోగా అందులోని 60 మందికి కంటి ఆపరేషన్లు అవసరం ఉందని కంటి వైద్య నిపుణులు డాక్టర్ పూజారి దత్తాగౌడ్ నిర్దారించారు. ఈ సందర్భంగా జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి మాట్లాడారు. కంటి ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని త్వరలో కరీంనగర్ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయిస్తామని తెలియజేశారు. అలాగే కంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్ ను 9391075767 సంప్రదించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి జయశంకర్ ఫౌండేషన్ మొగుళ్ళపల్లి మండల ప్రెసిడెంట్ నేర్పటి అశోక్, వైస్ ప్రెసిడెంట్ మంగళపల్లి శ్రీనివాస్, రేగొండ మండల ఇంచార్జ్, ఆకుల ప్రతాప్, యూత్ ఇంచార్జ్ చింతకింది రాజు, నేర్పటి శ్రీనివాస్, జన్నే సదానందం, ,శంషీర్, కేశెట్టి రమేష్ పాల్గొన్నారు.