లిరిక్ రైటర్ శ్రీనాథ్ ని కలిసిన కళావెలుగు ఛానల్ నిర్మాత
ములుగు, తెలంగాణ జ్యోతి : ప్రముఖ లిరిక్ రైటర్, విప్లవ గీతాల, ఓ నిర్మల బతుకమ్మ పాటల రచయిత వెన్నెల శ్రీనాధును కళావెలుగు ఛానల్ నిర్మాత కోరే అరవింద్ ములుగులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ మరుగున పడుతున్న జానపద కళా కారులను, గాయకులను తన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్న కార్యక్రమం మహోన్నత మైనదని కొనియాడారు. భవిష్యత్తులో మంచి గీతాలతో మున్ముందుకు సాగాలని అన్నారు. ఈ ప్రస్థానంలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు.
1 thought on “లిరిక్ రైటర్ శ్రీనాథ్ ని కలిసిన కళావెలుగు ఛానల్ నిర్మాత”