విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం.
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ గ్రీన్ వుడ్ పాఠశాలలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి క్రీడా పోటీలు మరియు వివిధ కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ బహుమతుల ప్రధానోత్స వo నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లా డుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడ లను ప్రోత్సహిం చడం వలన చదువుపై ఏకగ్రతతో పాటు తోటి విద్యార్థులతో స్నేహపూరిత వాతావరణానికి అలవాటు పడతారు. క్రీడల వల్ల గెలువాలని భావనతో ఆడుతారు కాబట్టి వాళ్లకు వాళ్లుకు తెలియకుండానే కాంపిటేటెడ్ స్పిరిట్ లెవల్సు పెరుగుతాయి.అవి భవిష్యత్తులో బాగా ఉపయోగ పడతా యని అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.