అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమం దేశానికే ఆదర్శం

Written by telangana jyothi

Published on:

అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమం దేశానికే ఆదర్శం

– తల్లితండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చదివించాలి.

– వాజేడు, వెంకటాపురం మండలాల్లో పలు రోడ్లు, భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు.

– వాజేడు,వెంకటాపురం మండలాల అభివృద్ధికి కృషి చేస్తా

– భద్రాచలం నియోజక వర్గం శానసభ్యులు తెల్లం వెంకట్రావు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమం దేశానికే ఆదర్శం (ప్లే స్కూల్) అని, మారుమూల ప్రాంతాల అభివృద్ధియే ప్రభు త్వ ధ్యేయమని భద్రాచలం నియోజకవర్గం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. శనివారం భద్రాచలం నియోజక వర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో భద్రా చలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి పలు రోడ్లు, గ్రామపంచా యితీ భవనం, అంగన్వాడి కేంద్ర భవనాలు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వాజేడు వెంకటాపు రం మండలాల్లోని నూతనంగా వివాహమైన ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన సీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ ఈ రెండు మండలాల్లో పది నెలల్లోనే 15 కోట్లతో నాగారం ప్రాయపట్ల, మరో ఏడు కోట్లతో ఇంచర్ల పల్లి ముత్తారం రోడ్లను మంజూరు చేసుకోవడం జరిగిందనీ ఆన్నారు. రానున్న కాలంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభి వృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దృష్టి తీసుకెళ్ళి మరిన్ని రోడ్లు మంజూరు చేసుకోవడం జరుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాలైన ఈ మండలా ల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజుల్లో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవారు అక్షరాభ్యాసం చేయించు కోవాలంటే బాసరకు వెళ్తున్నారని, శ్రీమంతాలు కూడా ఖర్చు కు వెనకాడకుండా చేసుకుంటున్నారని, కానీ, పేద వారికి కి ఆ లోటును తీర్చే విధంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ అక్షరాభ్యాసం మరియు శ్రీమంతం కార్యక్రమాలను ఘనంగా ఓ వేడుకలా నిర్వహించడం చాలా అభినందనీయం అని ప్రశంసించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమం దేశానికే ఆదర్శం (ప్లే స్కూల్) అని, తల్లి తండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చదివించా లని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 0-3 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన పౌష్టికా హారం అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే 03-06 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు పౌష్టికాహారం మరియు ఆటపాటలతో కూడిన విద్యా బోధన అందించడం జరుగు తుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు కార్పొరేట్ పాఠశా లలకు ధీటుగా అన్నీ విధాల మౌలిక వసతులతో అభివృద్ధి చెందుతున్నాయని, అందులో భాగంగానే ఈ నూతన భవనా లను నిర్మించడం జరుగుతుందని, తల్లి తండ్రులు తమ పిల్లల ను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందుతున్న ఉచిత విద్యను ప్రోత్సహించాల్సిన భాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఎస్ ఏ ఎం, ఎంఏఎం  పరిధిలో ఉన్న పిల్లలను సాధారణ స్థాయికి తీసుకు వచ్చేలా అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సౌకర్యాలను ప్రతీ లబ్ధిదారులు సక్రమం గా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, పంచాయితి రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, జిల్లా సంక్షేమాధికారిణి శిరీష, ప్రత్యేక అధి కారులు సర్దార్ సింగ్ , తహశీల్దార్లు వీరభద్రమ్, మండల అభి వృద్ధి అధికారులు,సిడిపిఓ ధనలక్ష్మి, ప్రజా ప్రతినిధులు, అంగ న్వాడీ టీచర్లు, విద్యార్థిని, ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now