ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి.
– జాతర విజయవంతం చేసిన అధికారులకు అభినందనలు
– జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ములుగు, ఫిబ్రవరి26, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు .ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం మూడు (3) దరఖాస్తులు రాగా (2) రెవెన్యూ , (1) ఇతర శాఖ కు చెంది నవి ఉన్నాయి. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం మహా జాతర విజయవంతం చేసిన అధికారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మేడారం మహా జాతరలో అధికారుల అంచనాలకు మించి భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతరను విజయవంతం చేశారని అన్నారు. జాతర ముగిసిన అనంతరం కూడా మేడారం పరిసర ప్రాంతాలలో పరిశుద్ధ పనులు కొనసాగు తున్నాయని అన్నారు. జిల్లా అధికారులు వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని , మత్స్య శాఖ అధికారి శ్రీపతి, వైద్య అధికారి అలేం అప్పయ్య , షెడ్యూల్ కులాల అధికారి తుల రవి, పంచాయతీరాజ్ అజయ్ కుమార్ , ఎల్ డి ఎం రాజ్ కుమార్, ఎమ్మార్వో విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.