కాటారంలో ప్రజాపాలన కళాయాత్ర
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా శుక్రవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కాటారం మండలం చేరుకు న్నారు. మండలంలోని కొత్తపల్లి, చింతకాని మండల కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారం టీలపైన కళాజాత నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం సమాచార పౌర సంబం ధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్వహిస్తున్నారు. సన్న వడ్ల వరి ధాన్యానికి 500 బోనస్, 500 కే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 వందల యూనిట్ల ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల పెంపు, రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ పైన అనేక పాటలను పాడుతూ ప్రదర్శన ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఓనపాకల కుమార్, కమ్మల ప్రవీణ్ కుమార్, ఆత్మకూరి మహేందర్,చీకట్ల శంకర్,చిలుముల మధుబాబు, సెగ్గం శిరీష జాడీ సుమలత, పులి రాధిక, కాస స్వాతి, గడ్డం నాగమణి, తదితరులు పాల్గొన్నారు.