వెంకటాపురం, వాజేడు మండలాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
వెంకటాపురం, వాజేడు మండలాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
– 132 కెవి లైన్ కు ఆరు రోజులు పాటు మరమ్మతులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం, వాజేడు మండలాల్లో విద్యుత్ సరఫరాను ఈనెల 25వ తేదీ నుండి, 30వ తేదీ వరకు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిలిపివేయనునట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వెంకటాపురం మండలంలో ఆలుబాక, వెంకటాపురంలో విద్యుత్ సబ్స్టేషన్ తో పాటు, 132 కెవి విద్యుత్ సబ్స్టేషన్ లు ఉన్నాయి. వాజేడు మండలంలో, వాజేడుతో పాటు ధర్మారం గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల ద్వారా వినియోగదారులకు సేవలను అందిస్తున్నారు. ఆరు రోజులు పాటు విథ్యుత్ లైన్ లో అత్యవసర మరమ్మతుల కారణంగా, రేపటి నుండి ప్రతిరోజు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నందున వినియోగదారులు సహకరించాలని కోరారు