మంత్రి హామీతో సమ్మె వాయిదా
మంత్రి హామీతో సమ్మె వాయిదా
– ఏఐటీయూసీ పోరాట ఫలితంగా కార్మికుల జీతాలకు బడ్జెట్ విడుదల
– జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్
ములుగు ప్రతినిధి : తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేయుచున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు గత 7నెలలుగా బడ్జెట్ లేక పోవడంతో కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు అందలే దనే కారణంతో ఈనెల 19 నుంచి చేపట్టనున్న సమ్మెను మంత్రి హామీతో విరమించుకుంటున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటి యుసి) జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ తెలిపారు. బుధవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహలతో చర్చలు జరుపగా సంబంధిత ఫైనాన్స్ అధికారులతో మాట్లాడి బడ్జెట్ రిలీజ్ చేయించారని వెల్లడిం చారు. అందుకుగాను ఈనెల 19 నుంచి చేపట్టనున్న సమ్మె ను విరమించుకున్నట్లు రవీందర్ పేర్కొన్నారు. ఏఐటీ యూసీ పోరాట ఫలితంగానే నిధులు విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు.