ఇంటి వద్దకే తపాలా సేవలు.

ఇంటి వద్దకే తపాలా సేవలు.

  • పోస్టల్ డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
  • భద్రాచలం తపాలా అధికారి వి.సుచేందర్.

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : పోస్టల్ పొదుపు బీమా సేవలను సద్వినియోగం చేసుకుంటే వారి కుటుంబాలకు ఆర్థిక భరోస కల్పించేందుకు పోస్టల్ సేవలను కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా ఇంటి వద్దకే తీసుకొని వస్తుందని పోస్టల్ శాఖ ఎఎస్పి వి.సుచెందేర్ అన్నారు. బుధవారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం సబ్ పోస్ట్ ఆఫీస్ నందు పోస్టల్ డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి మండలం నుండి ప్రజలు, పోస్టల్ ఖాతాదారులు హాజరయ్యారు. పోస్టల్ శాఖ ద్వారా అందించే సేవలను అదికారి వి.సుచెంధర్ వివరించారు . ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి ఖాతా 250 రూపాయలతో ప్రారంభించవచ్చని,1లక్ష 50 వేలు మించకుండా పొదుపు చేసుకోవచ్చన్నారు. వీటితోపాటు టైం డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస పత్రం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్, ఐపిపిబి ,ఇన్సూరెన్స్ సేవల గురించి వివరించారు.ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పని సరిగా మారిన నేపథ్యంలో, ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ఆధార్ సేవలు అందించాలని తపాలా శాఖ నిర్ణ యించిందన్నారు. 399 రూపాయలు చెల్లిస్తే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సైతం పోస్టల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో పోస్టల్ కార్యాలయాలను ప్రారంభించిందని ,ఈ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ వి.సుచెందర్ కోరారు. పోస్టల్ కార్యాలయాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అకౌంట్ కావాలంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి తీసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో ఎం.ఒ ఎం.దుగ్రప్రసాద్. వెంకటాపురం పోస్ట్ మాస్టర్ ఇ.నారాయణ, వెంకటాపురం, వాజేడు మండలాల పోస్టల్ ఉద్యోగులు, గ్రామస్థులు పాల్గొన్నారు.