నాణ్యత లోపిస్తున్న సీసీ రోడ్లు – కానరాని అధికారుల పర్యవేక్షణ

Written by telangana jyothi

Published on:

నాణ్యత లోపిస్తున్న సీసీ రోడ్లు – కానరాని అధికారుల పర్యవేక్షణ

– రోడ్డు నీళ్లపాలు.. డబ్బులు కాంట్రక్టర్ పాలు…

– సీసీ రోడ్ల పనులపై జిల్లా కలెక్టర్ స్పందించాలి

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : మండలంలో నూతనం గా వేసిన సీసీ రోడ్ల పనులు అన్ని నాణ్యత లోపానికి నిదర్శనంగా తయారువుతున్నాయి. ఏజెన్సీ గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేపడుతన్నామని, ప్రజాప్రతినిధులు చెప్పు కుంట్టూనే సీసీ రోడ్లకు నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్లో కళ్ళకు కనిపించడానికి మాత్రమే భవన నిర్మాణ ఇసుక, సిమెంట్, కంకరను పైపైకి వాడుతున్నట్లు హడావుడి చేస్తు న్నారు. కానీ లోపానికి గురిచేసే వైట్ డస్ట్ వాడుతూ సీసీ రోడ్లు వేశారంటూ, ఇలా వేయడం సమంజసం కాదని గ్రామ స్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలో ఇంత వ్యవహారం జరుగుతున్న సంబంధిత మండల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. రోడ్డు పనులు జరిగే సమయంలో పంచాయితీరాజ్ అధికారి కనీసం అక్కడ వర్క్ ఇన్ స్పెక్టర్ కూడా సరిగా ఉండటం లేదు. ఈ క్రమంలో గుతేదార్లు ఆడిందే ఆట పడిందే పాట అన్న చందంగా మారింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ పనులపై ఆరా తీసి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కానరాని అధికారుల పర్యవేక్షణ..

గ్రామాల్లో లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో జరుగు తున్న రోడ్డు పనులు నాసిరకంగా చేపట్టారు. ఉన్నతాధికా రుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. నాసిరకం మెటీరియల్ వాడకం వల్ల నిర్మించిన రోడ్డు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారాయి.

రోడ్డు నీళ్లపాలు.. డబ్బులు కాంట్రాక్టర్ పాలు

ఏజెన్సీ మండలంలో ఇష్టం వచ్చినట్లు కంకర ఇసుక సిమెంటు కలుపుతూ సీసీ రోడ్లు వేశారు. నాసిరకం మెటిరియల్ తో రోడ్డు వేయడంతో వేసిన నెలలోపే రోడ్లు పగుళ్లతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు కాంట్రాక్టర్ల పాలవుతు న్నాయి. అధికారులు కూడా నిర్మాణ పనులను పర్యవేక్షించక పోవడంతో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి.

Leave a comment