Polling |  మంథని తో సహా 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగింపు

Polling |  మంథని తో సహా 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగింపు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగుస్తుందని సీ ఈ సీ ప్రకటించింది.సిర్పూర్,చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్,మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో ఉ.7 గంటల నుంచి సా.4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా నియోజకవర్గాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.