మంత్రి పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం

మంత్రి పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం

కన్నాయిగూడెం,తెలంగాణ జ్యోతి : మండలంలోని ముప్ప నపల్లి గ్రామంలో ఉన్న కేజీవిబి  విద్యాలయం ప్రారంభోత్స వానికి గ్రామీణాభివృద్ధి,పట్టణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పర్యటన శనివారం రోజున కన్నాయిగూడెం మండలంలో కొనసాగింది. మంత్రి పర్యటన బందోబస్త్ లో ఉన్న సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు ఓవర్ యాక్షన్ తో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మంత్రి పర్యటనను కవరేజ్ చేయడానికి వెళ్లిన స్థానిక పాత్రికేయులను బృందంను టైం అయిపోయిందని అడ్డుకోవడం జరిగింది. దీంతో తమ వద్ద ఉన్న ఐడీ కార్డులను పోలీస్ అధికారులకు చూపించినా కూడా అనుమతి నిరకరించడం జరిగింది. మంత్రి సీతక్క పర్యటనను కన్నాయిగూడెం  మండలంలోని పాత్రికేయులు బహిష్కరించారు.