గుడుంబా స్థానాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థానాలపై పోలీసుల దాడులు

తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాటారం పోలీసులు పంజా విసురు. ఇందులో భాగంగా గుడుంబా, బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపుతున్నారు. కాటారం ఎస్సై మ్యాక అభినవ్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ప్రజలతో సభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు చేపట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించవద్దని, గుడుంబా తయారు, అమ్మకాలు చేపట్టవద్దని వారు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌తో పాటు గంగారాం తండాలో గుడుంబా స్థావరాల పై దాడులు నిర్వహించి 18 లీటర్ల గుడుంబా పట్టుకుని, 600 లీటర్ల బెల్లం వాష్, సంబంధిత వస్తువులను ధ్వంసం చేశారు. ప్రజలతో మమేకమై గుడుంబాకు సంబంధించి ప్రజలను హెచ్చరించి సజావుగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలకు సహకరించాలని సూచించారు.