కాళేశ్వరం లో పోలీసుల ప్లాగ్ మార్చ్
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాళేశ్వరంలో త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా, వారిలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం మహదేవపూర్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ సీఆర్పీఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్తానిక శ్రీపాద విగ్రహం దగ్గర నుండి పురవీధుల గుండా కవాత్ నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ,స్వచ్చదంగా ఓటు వినియోగించుకోవాలని మహదేవపూర్ సిఐ రాజేశ్వరరావు, కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ అన్నారు. ఈ ఎన్నికల నేపద్యంలో గొడవలు,ఘర్షణలకు పాల్పడినట్లైతే జీవితాంతం బైండోవర్ల పాలవుతారని అన్నారు.