అనారోగ్యంతో పోలీసు జాగిలం మృతి

అనారోగ్యంతో పోలీసు జాగిలం మృతి

అనారోగ్యంతో పోలీసు జాగిలం మృతి

– నివాళులర్పించిన ఎస్పీ శబరీష్

ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో పోలీసు శాఖకు తన దైన సేవలు అందించిన పోలీసు జాగిలం స్కాంపర్ అనారో గ్యంతో మృతిచెందింది. జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్, ఇతర అధికారులు జాగిలంకు శాఖాపరమైన గౌరవవందనం అందిం చి నివాళులర్పించారు. జిల్లాలో పోలీసు శాఖ తరఫున సుదీ ర్ఘ సేవలు అందించిన స్కాంపర్ కు మోయినాబాద్ ఐఐటిఏ లో శిక్షణ ఇచ్చారు. అనంతరం 2018లో ములుగు జిల్లా డాగ్ స్క్వాడ్ బృందంలో చేరి ఆరేళ్లుగా మందు పాతరలు కని పెట్టడంలో కీలక సేవలు అందించింది. కిడ్నీల సమస్యతో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు అధికారులు వెల్లడించారు. జాగిలానికి జిల్లా ఎస్పీతో పాటు అధికారులు జాకారం పీటీసీలో పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, ఆర్ఐలు సంతోష్, వెంకట్ నారాయణ, తిరుపతిరెడ్డి, ఆర్ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ బృందం సభ్యులు పాల్గొన్నారు.