గ్రామ సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ ముందడుగు
– గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి సమావేశాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని సంభందిత ఉన్నతాధి కారులకు తెలియపరిచి ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా పోలీస్ శాఖ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారు. పోలీస్ అమరవీరుల వారోత్స వాల సందర్భంగా ములుగు జిల్లా పోలీసు అధికారుల ఆదేశంపై పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ ఆధ్వర్యంలో నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం గుమ్మడి దొడ్డిలో మంగళవారం పంచాయతీ పరిధి చుట్టు పక్కల గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా పోలీస్ శాఖ కృషి చేసేలా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను ఆయా గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలతో తెలుసుకొని ఆయా సమస్యల ను నమోదు చేసుకున్నారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని సి.ఐ .బండారి కుమార్ తెలిపారు. అలాగే గ్రామాల్లో కోడిపందాలు, పేకాట, జూదం, గంజాయి,గుడుంబా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా వారి, వారి గ్రామాల్లో నిఘాతో ఉజ్వల భవిష్యత్తు కోసం గ్రామీణులు ముందుకు సాగాలని కోరారు. గ్రామీణ యువత, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని, ప్రభుత్వ సంక్షేమ, గిరిజన సంక్షేమ పథకాలును సద్వినియోగం చేసుకో వాలని సి.ఐ.కోరారు. బడి వయసు పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల ని, ఇంకా అనేక అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పిం చారు. అసాంఘిక శక్తుల వలలో పడవద్దని, ఉజ్వల భవిష్య త్ కోసం ముందుకు సాగాలని కోరారు. ఈ సమావేశంలో వాజేడు ఎస్.ఐ.రుద్ర హరీష్, గుమ్మడి దొడ్డి మాజీ సర్పంచ్ జానకి రమణ, జి.పి.కార్యదర్శి అశోక్, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.