తిప్పాపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ 

Written by telangana jyothi

Published on:

తిప్పాపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ 

– అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దు. 

– వెంకటాపురం సిఐ బండారి కుమార్

నూగురువెంకటాపురం, తెలంగాణ జ్యోతి:ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం మారుమూల అటవీ ప్రాంతమైన తిప్పాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అపరిచిత, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. అసాంఘిక శక్తుల మాయమాటల వలలో పడరాదని కోరారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతున్నదని ,ఆయా నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. భవిష్యత్తులో సంభవించే గోదావరి వరదలు భారీ వర్షాలు కారణంగా వాగులు పొంగిన సమయంలో చేపల వేటకు వెళ్ళరాదని, ఈతల కు వెళ్ళరాదని , అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయ సహకారాలు గ్రామస్తులు పొందాలని, పోలీస్ శాఖ తో పాటు ఇతర పౌర శాఖలు కూడా సేవలందిస్తాయని తెలిపారు. గ్రామీణ యువత విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. బడి వయస్సు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని, విద్యా యొక్క ప్రాముఖ్యతను వివరించారు.అదేవిధంగా రాబోయే వర్షాలకు వాగులు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సి.ఐ .కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ .ఐ. వెంకటాపురం కే. తిరుపతి రావు, సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఓభయ్యా, స్పెషల్ పార్టీ, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిప్పాపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ 

Leave a comment