పూసుకుపల్లి లో పోలీసుల కార్డెన్ సెర్చ్

పూసుకుపల్లి లో పోలీసుల కార్డెన్ సెర్చ్

పూసుకుపల్లి లో పోలీసుల కార్డెన్ సెర్చ్

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండలం పూసుకుపల్లి గ్రామంలో సోమవారం ఉదయం కాలేశ్వరం ఎస్ఐ సిహెచ్ చక్రపాణి, మహాదేవపూర్ ఎస్సై కే. పవన్ కుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పుసుకుపల్లి గ్రామంలో ఇంటింటా క్షుణ్ణంగా తనిఖీ లు చేపట్టి, వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేసి వాటి పత్రాలను పరిశీలించారు. నెంబరు ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాని కూడలి వద్ద గ్రామస్తులతో సమావేశమయ్యారు. కాలేశ్వరం ఎస్సై సిహెచ్ చక్రపాణి మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు చోటు ఇవ్వద్దని, నిషేధిత గుడుంబా ఎవరు అమ్మోద్దని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపారు. గోదావరి తీరా గ్రామాలు కాబట్టి ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అలాగే యువత బాగా చదువు కొని ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆశించారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న పోలీసులకు తెలపాలని, సిసి కెమెరాలు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ పోలీసులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు దళం పాల్గొన్నారు.