కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన దగ్గర పోలీసుల తనిఖీలు.

Written by telangana jyothi

Published on:

కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన దగ్గర పోలీసుల తనిఖీలు.

తెలంగాణ జ్యోతి, కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య నేపద్యంలో కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన చెక్ పోస్ట్ వద్ద కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ఆధ్వర్యంలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్న వాహనా లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వివరాలను అడిగి తెలుసుకుం టున్నారు. అనుమానితులను విచారించి వదిలేస్తున్నారు. సమాచారం మాకు-బహుమతి మీకు అనే మావోయిస్టుల ఫోటోలతో కూడిన కరపత్రాలను ప్రయాణికులకు చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మావోయిస్టుల సమాచారం తెలియజేస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, నగదు బహుమతి అందజేస్తామని ఎస్సై భవాని సేన్ పేర్కోన్నారు.

Leave a comment