మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం
– విస్తృతంగా వాహనాల తనిఖీలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని విజయపురి కాలనీ గ్రామ సమీపంలో కొత్తపల్లి క్రాస్ రోడ్ వద్ద, నూగురు వెంకటాపురం సి.ఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో గురువారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఈ తనిఖీల్లో వెంకటాపురం ఎస్.ఐ కొప్పుల తిరుపతిరావు, సివిల్ మరియు ఆలుబాక సిఆర్పిఎఫ్ సిబ్బంది, తదితరులు వాహనాల తనిఖీల కార్యక్రమంలో పాల్గొన్నారు.